- 12 September, 2026
బరేలీ, జనవరి 28, 2026: తెలుగు ప్రాంతం 2026 జనవరి 24 నుండి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో నిర్వహించబడిన 10వ భారతీయ కాథలిక్ యువజన ఉద్యమం (ICYM) జాతీయ మండలి సమావేశంలో క్రియాశీలంగా పాల్గొంది. ఈ సమావేశం దేశవ్యాప్తంగా యువ నాయకులను మరియు ప్రతినిధులను ఒక వేదికపైకి తీసుకువచ్చి, భారతదేశంలో యువజన సేవల లక్ష్యం, సవాళ్లు మరియు భవిష్యత్తు దిశపై లోతైన ఆలోచనకు దారితీసింది. తెలుగు కాథలిక్ యువజన ఉద్యమం (TCYM) తరఫున రెవ్. ఫా. మేడి స్లీవరాజు SDB (ప్రాంతీయ యువజన దర్శకులు), గౌతమ్ (ప్రాంతీయ యువజన అధ్యక్షులు), మేరీ జలుమూరు (ప్రాంతీయ యువజన ప్రధాన కార్యదర్శి), దివ్య వాణి (మహిళా ప్రతినిధి), మరియు ప్రవీణ్ కళ్యాణ్ (మాజీ NEXCO సభ్యుడు) పాల్గొన్నారు.
కార్యక్రమం ఘనంగా నిర్వహించిన ప్రారంభ పవిత్ర దివ్యబలి పూజతో ప్రారంభమై, పాల్గొన్న వారిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని బలపరిచింది. అనంతరం ప్రాంతీయ నివేదికల సమర్పణలు మరియు ముఖ్య అంశాలపై చర్చలు జరిగాయి. జాతీయ మండలి సమావేశంలో తెలుగు ప్రాంతం TCYM కార్యకలాపాలు, సాధించిన పురోగతి మరియు కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది. తదుపరి సమావేశాలు ప్రాంతీయ రోల్ కాల్‌తో పాటు ప్రతి ప్రాంతానికి చెందిన NEXCO సభ్యుల పరిచయంతో కొనసాగాయి. TCYM తరఫున రెవ్. ఫా. మేడి స్లీవరాజు (RYD) గారు దివ్య వాణి గారిని జాతీయ స్థాయి NEXCO అభ్యర్థిగా పరిచయం చేశారు.
ICYM నివేదికలు, ఆర్థిక లెక్కలు, యువత సమస్యలు మరియు యువతా ఉద్యమం, యువతా కమిషన్‌కు సంబంధించిన అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ICYM చైర్మన్ మరియు బరేలీ బిషప్ అయిన మహామహోపాధ్యాయులు మహా పూజ్య . డా. ఇగ్నేషియస్ డి’సౌజా గారు, యువత సేవ మరియు నాయకత్వంపై ప్రేరణాత్మక సందేశం అందించారు. బరేలీ మేత్రాసనం నిర్వహించిన వినోద కార్యక్రమాలు స్నేహభావాన్ని మరింత బలపరిచాయి. అనంతరం పవిత్ర ఆరాధన (హోలీ అడోరేషన్) నిర్వహించబడుతూ, పవిత్రాత్మ మార్గదర్శకత్వం కోసం అందరూ ప్రార్థించారు.
ముగింపు సమావేశాలు బిషప్ గారి చేత నిర్వహించబడిన పవిత్ర దివ్యబలి పూజతో ప్రారంభమై, అనంతరం జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది. బయలుదేరుతున్న NEXCO బృందానికి వీడ్కోలు పలికారు. NEXCO ఎన్నికల కమిటీ పర్యవేక్షణలో క్రమబద్ధంగా ఎన్నికలు నిర్వహించబడి, నూతనంగా ఎన్నికైన NEXCO బృందానికి అభిషేకం జరిగింది. చివరగా ICYM గీతంతో జాతీయ మండలి సమావేశం ముగిసింది.
ఈ జాతీయ సమావేశంలో భాగస్వాములమయ్యే అవకాశం లభించినందుకు తెలుగు ప్రాంతం గర్వంగా మరియు కృతజ్ఞతతో ఉంది. ఈ అవకాశం కల్పించిన TCBC యువతా విభాగం చైర్మన్ మహా పూజ్య. డా. రాయరాల విజయ్ కుమార్ గారు, శ్రీకాకుళం పీఠాధిపతులు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ప్రార్థనలతో మమ్మల్ని ఆశీర్వదించిన మహా పూజ్య . డా. పొలిమేర జయరావు గారు, ఏలూరు పీఠాధిపతులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
– మేరీ జలుమూరు
ప్రాంతీయ యువతా ప్రధాన కా
ర్యదర్శి
© 2026 CATHOLIC CONNECT POWERED BY ATCONLINE LLP